KDP: వేంపల్లిలో సోమవారం జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగ ఉపాధ్యాయులు అనిల్ రాచవీటి తేజేంద్ర తెలిపారు. స్థానిక శ్లోక ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 8 నుంచి 45 ఏళ్ల లోపు వారు పోటీలలో పాల్గొనవచ్చు అన్నారు. ప్రతిభ కనబరిచిన వారు తూర్పుగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.