యెమెన్ రాజధాని సనా లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. అసర్, హిజాబ్ విద్యుత్ ప్లాంట్లు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులకు పాల్పడింది. హుతీ రెబెల్స్ క్షిపణీ దాడులకు ప్రతీకార చర్యగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమపై ప్రయోగించిన ప్రతీ క్షిపణికి హుతీలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.