NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను ఇవ్వాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కల్లబొల్లి మాటలు చెప్పి బీసీలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు.