సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలోని గౌడనాహళ్లి, కదిరేపల్లి, ఆర్ అనంతపురం, మెలవాయి, ఆమిదాలగొంది పంచాయితీల్లో వైసీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రతినిధులు, నాయకులు పాల్గొని చంద్రబాబు ఇచ్చిన సూపర్–6 హామీలు అమలు కాలేదని, ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రజలు దీనిని గుర్తుంచుకుని బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.