మేడ్చల్: చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధి భరత్‌నగర్‌లో ఓ వృద్ధుడు భిక్షాటన చేస్తూ, గత 10 రోజులుగా స్టేషన్‌లోని బ్యాటరీ స్టోరేజ్ బిల్డింగ్ వద్ద నిద్రిస్తున్న స్థితిలో కనిపించాడని ఓ వ్యక్తి డయల్ 100 ద్వారా పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా శరీరంపై గాయాలు లేకపోవడంతో, అనారోగ్యంతో మరణించి ఉంటాడని పోలీసులు అనుమానించారు.