NZB: గ్రామాల్లో ఉన్న మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహిళా సంఘాల్లో చేరి లబ్ధి పొందాలని ఏర్గట్ల IKP APM కుంట గంగాధర్ పేర్కొన్నారు. నూతన సంఘాల ఏర్పాటుకు నిర్వహిస్తున్న పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం భట్టాపూర్లో పర్యటించారు. ఈ క్రమంలో ఇంటింటి ప్రచారంలో ఆయన మహిళా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.