ASR: మహిళల భద్రత, సంక్షేమం, అభివృద్ధి కొరకు దీపం 2.O, తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న అరకులోయ గిరిజన మ్యూజియం వద్ద “స్త్రీ శక్తి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఇంఛార్జ్ సియ్యారి దొన్నుదొర తెలిపారు. కావున నియోజకవర్గ మహిళలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.