KMR: పిట్లం మండలం పోతిరెడ్డిపల్లిలోని హనుమాన్ ఆలయంలో శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలో శివలింగానికి 112 కలశాలతో రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, హోమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తేజ స్వామి తెలిపారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు.