KNR: శంకరపట్నం మండలం కాచాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చిలువేరు మదనయ్య అనే రైతుకు చెందిన ఆవు, దూడలను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో ఎత్తుకెళ్లారు. రోజుకు ఆరు నుంచి ఏడు లీటర్ల పాలు ఇచ్చే ఆవును కోల్పోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. త్వరగా పట్టుకోవాలని కోరారు.