KMM: రైతుల పంట పొలాల్లో ట్రాన్స్ ఫార్మర్లో రాగిని దొంగలించి అమ్ముతున్న ఆరుగురిని శనివారం అరెస్ట్ చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ అన్నారు. వారి వద్ద నుండి 100 కేజీల రాగి, రూ.20 వేలు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నరేష్, తేజేశ్వర్ రెడ్డి, సిబ్బంది రాజు, సంజీవ్ పాల్గొన్నారు.