NZB: మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు 16 గేట్లను తెరిచి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా, మొత్తం నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుతం 79.65 టీఎంసీల నీరు నిల్వ ఉంది.