NZB: మండపాలకి పక్కన దారిని వదలాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు వెళ్లడానికి ఎక్కడ ఇబ్బందులు కలిగించ కూడదన్నారు. సామాన్య ప్రజలకు, నడకదారిన వెళ్లే ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని సూచించారు. గణేష్ మండపాలు రోడ్లపై ఏర్పాటు చేసేవారు కుడి, ఎడమ రహదారి వదలాలన్నారు.