కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమం శనివారం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది స్టేషన్ ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసి, చెత్త, ప్లాస్టిక్ తొలగించారు. శ్రమదానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలు స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని SI అన్నారు.