రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. రాగి పాత్రలో నీళ్లను నిల్వ ఉంచడం వల్ల ఆ నీళ్లలోకి చేరే రాగి అణువులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ నీరు జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.