SRD: ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులో 161వ జాతీయ రహదారి వంతెన సమీపంలో లారీ బోల్తా పడింది. సంగారెడ్డి నుంచి నాందేడ్ వెళ్తున్న అరటి పండ్ల లారీ ఆదివారం ప్రమాదమశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పవన్ వికారికి స్వల్ప గాయాలు కాగా క్లీనర్‌కు ప్రమాదం తప్పింది.