TG: దేశంలో IAS, IPSలకు రక్షణ లేకుండాపోయిందని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. సీజేఐ గవాయ్‌పై దాడి యత్నం అమానుషం అన్నారు. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కుల మతాల మధ్య బీజేపీ నేతలు చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రంలో దళితులకు అండగా సంస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దళితులు ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు.