NZB: నవీపేట్లో అక్రమ పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వెహికల్ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా, అందులో NZB నుంచి ధర్మాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 25 సంచుల రేషన్ బియ్యం గుర్తించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సివిల్ సప్లై అధికారులకు అప్పగించామన్నారు.