NLG: నల్గొండ పెద్ద బండకి చెందిన యువకుడు జక్కల మల్లేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు మునీర్ అహ్మద్ షరీఫ్ ఆదివారం మల్లేష్ నాయనమ్మను పరామర్శించారు. ఆయన మల్లేష్ కుటుంబానికి రూ.10 వేల నగదుతో పాటు 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో సలీం, నరసింహ, కృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.