NLG: నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు MLGలోని తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీలలో ఆయన పర్యటించారు. వీధి వీధినా తిరుగుతూ పేద ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా పరిశీలించారు. పేదోళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.