ADB: నేరడిగొండ మండలంలోని వడూరు గ్రామానికి చెందిన కడారి వినోద్ (23) మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లమని మందలించడంతో మనస్తాపానికి గురైన వినోద్ పంట పొలానికి వెళ్లి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.