AP: ఢిల్లీలో ఈ నెల 14న గూగుల్‌తో చరిత్రాత్మక ఒప్పందం జరగనుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంతో పాటు దేశానికి కూడా ఇది ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అవుతుందని చెప్పారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంతో సాంకేతిక దశ దిశ మారనుందన్నారు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నామని తెలిపారు.