ADB: నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదివారం తెలిపారు. నిందితుడు, అతనికి సహకరించిన రియాల్టీ ముఠా ఈడీ ఆధీనంలో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసినట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయమై అక్టోబర్ 10 తేదీన ఫిర్యాదుదారుడు దుమ్మటి సూర్య రామకృష్ణ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.