MDK: నిజాంపేట మండల కేంద్రంలో శనివారం పలు దుకాణాలలో డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఎస్సై రాజేశ్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాంబు స్క్వాడ్, డాగ్స్‌తో తనిఖీలు చేపట్టామన్నారు. గ్రామాలలో గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించామన్నారు.