HYD: ఖైరతాబాద్‌లోని బడా గణేష్‌కు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేసి రెండు నెలల పాటు 150 మంది కళాకారులతో కలిసి మహాగణపతి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దామని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. మూడు ముఖాలతో, పంచముఖ నాగేంద్రుడి నీడలో నిలబడి ఉన్న ఆకారంలో మట్టితో రూపొందించిన మహాగణపతిని ఆద్యంతం అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.