W.G: పోలీస్ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందికి మంగళవారం రాత్రి బాడ్మింటన్ ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోలీస్ అధికారుల విభాగంలో భీమవరం టూ టౌన్ ఇన్స్పెక్టర్ కాళీ చరణ్, జూనియర్ అసిస్టెంట్ అజయ్ కుమార్ టీమ్, సిబ్బంది విభాగంలో ఎఎస్సై సాయి, కానిస్టేబుల్ నరసింహల టీం ఘన విజయం సాధించారు.