TG: బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పడానికి వెళ్తే ఒకరి నుంచి మరొకరికి పంపుతూ తనను ‘ఫుట్‌బాల్’ ఆడుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలోని ఓ ప్రధాన కార్యదర్శికి ఫుట్‌బాల్‌ను బహుమతిగా ఇచ్చి నిరసన తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షుల తీరుపై ఆగ్రహించారు. పార్టీలో సమన్వయం లోపించిందన్నారు.