TG: రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో జరిగే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.