NLG: నల్గొండలో భక్తులు తమ ఆలోచనా ధోరణి మార్చుకుని భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రమాదకరమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సింథటిక్ కలర్లతో తయారు చేసిన విగ్రహాలకు బదులు మట్టితో తయారు చేసిన ప్రతిమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యాపారులు కూడా నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో మట్టి విగ్రహాలు విక్రయిస్తున్నారు.