KMM: టీజీ డీఈఈ సెట్ రెండో దశ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైందని ఖమ్మం ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపల్ నాంపల్లి రాజేష్ తెలిపారు. కళాశాలల వారీగా ఖాళీలు, ఇతర వివరాలు ఈ నెల 25న deecet.cdse.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఆపై అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఈనెల 26న డైట్లో సంప్రదించాలని సూచించారు.