AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శ్రీ బాల వినాయక స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఉదయం నిర్వహించారు. దేవాదాయ శాఖ నుంచి వినాయక ఆలయానికి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిలర్ రాజేష్ కమిటీ సభ్యులకు కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఎటువంటి లోటు పాటు లేకుండా చూడాలన్నారు.