SS: సోమందేపల్లి చెరువు కట్టకు పూర్వ వైభవం తీసుకొస్తామని టీడీపీ నాయకుడు నీరుగంటి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించారు. మంత్రి సవిత ఆదేశాలతో ముళ్లపొదలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు సూరి, వడ్డీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.