KMR: రాష్ట్ర స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ పోటీలకు బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు క్రీడా నిర్వాహకులు భరత్ రాజ్ శుక్రవారం తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన రన్నింగ్ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన నందిని అండర్-14 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా, నిరీక్షణ అండర్-16 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించినట్లు ఆయన వివరించారు.