BHPL: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలో ‘జాతీయ క్రీడా దినోత్సవ రన్’ నిర్వహించనున్నట్లు యువజన, క్రీడా శాఖ అధికారి రఘు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జయశంకర్ సార్ బొమ్మ నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ఈ రన్ జరుగనుంది. జిల్లా అధికారులు, క్రీడాకారులు, క్రీడా సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.