KMM: ఇందిరమ్మ గృహ నిర్మాణ పెండింగ్ గ్రౌండింగ్ పనులను వేగవంతం చేయాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. వచ్చే వారం రోజుల్లో నగర పాలక సంస్థ పరిధిలో 70 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.