SKLM: రణస్థలం మండలం కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గది, టాయిలెట్స్, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. భోజనం రుచిగా వేడిగా ఉండేలా చూడాలని ఆదేశించారు.