NRPT: మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామంలో శుక్రవారం అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా జడ్పీ సీఈవో, మరికల్ మండల ప్రత్యేక అధికారి శైలేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీలో చిన్నారులకు అందిస్తున్న పౌష్ఠికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో కొండన్న, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ధన్వాడ విండో అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి ఉన్నారు.