KKD: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచి స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు సమర్పించిన విరాళాలు వివిధ సేవలు ద్వారా రూ. 3,65,750 ఆదాయం వచ్చినట్లు ఈవో దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు.