VKB: విద్యుత్ మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆదివారం ఏఈ హరికృష్ణ తెలిపారు. పరిగి మండలాల్లో అన్ని గ్రామాల్లో సంబంధించిన విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ కోతలు ఉంటాయన్నారు. ఇందుకు రైతులు, వినియోగదారులు విద్యుత్ ఉద్యోగులకు సహకరించాలని కోరారు.