HYD: వినాయక చవితి నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నడుంబిగించింది. గ్రేటర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయనుంది. 3.24 లక్షల విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మట్టి విగ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం గురించి విద్యార్థులతోపాటు ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వివరించింది.