KDP: వినాయక చవితి శాంతియుతంగా జరగాలని, భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శనివారం మైదుకూరులో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు అవసరం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.