కోనసీమ: పరిశుభ్రమైన పరిసరాలు అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెంలో ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీని శుభ్రం చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ.. ప్రతి రోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి చేస్తున్న కృషిని కొనియాడారు.