SRPT: చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు 3,87,101క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు 11గేట్లను నాలుగున్నర మీటర్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. టీజీ జెన్కో నాలుగు యూనిట్లు ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు శనివారం సాయంత్రం తెలిపారు.