JN: జనగామ నుంచి పాలకుర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో పటేల్ గూడెం క్రాస్ రోడ్ వద్ద మట్టి రోడ్డుపై లారీ దిగబడడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత గుత్తేదారు పనులు ఎప్పుడూ పూర్తి చేస్తారని ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.