NGKL: అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే మిషన్ భగీరథ,ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా పైపులు దెబ్బతినడం లేదా నీరు కలుషితం కావడం వంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలి సూచించారు.