TG: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో వివాహిత లక్ష్మీప్రసన్న అనుమానాస్పద మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది. తమ కుమార్తెను అల్లుడు నరేశ్ రెండేళ్లుగా ఇంట్లో బంధించి, తిండి పెట్టకుండా చంపారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట లక్ష్మీప్రసన్న బంధువులు ధర్నాకు దిగారు. ఆమె మరణానికి కారణమైన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.