NZB: కళాశాలలో ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కరరావు తెలిపారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలను సోమవారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కళాశాలలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యుల నుంచి తెలుసుకున్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే లీగల్ సెల్ 9440901057కు సంప్రదించాలని సూచించారు.