MBNR: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఏఎంసీ వైస్ ఛైర్మన్ జవాజీ శేఖర్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం ఈద్గాన్ పల్లి గ్రామంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని వెల్లడించారు.