VZM: విజయనగరం మండలం గొల్లలపేట గ్రామంలో టీడీపీ నుండి వైసీపీలో చేరినట్టు వచ్చిన వార్తను మండల పార్టీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొద్దల నర్సింగరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.