WGL: పర్వతగిరి పట్టణంలోని KGVB పాఠశాలలో మంగళవారం మహిళా సమానత్వ దినోత్సవం, మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా స్వేరోస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథి ఎంఈవో లింగారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినిలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులోని 80 మంది విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.