MDK: మెదక్ కార్మిక శాఖ కార్యాలయంలో నిన్న భవన నిర్మాణ కార్మికులకు E-SRAM కార్డులను పంపిణీ చేశారు. జిల్లా కార్మిక శాఖ అధికారిగా ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న నర్సాపూర్ సహాయ కార్మిక శాఖ అధికారి సత్యేంద్ర కుమార్ కార్మికులకు కార్డులను అందజేశారు. ఇందులో జిల్లా భవన నిర్మాణ కార్మిక సంస్థ అధ్యక్షుడు కొండి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు ఆకుల బిక్షపతి, కృష్ణ పాల్గొన్నారు.